English | Telugu
సల్మాన్ మెంటల్ కాదు జై హో
Updated : Jul 19, 2013
తెలుగులో సూపర్ హిట్టయిన చిరంజీవి "స్టాలిన్" చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి "మెంటల్" అనే టైటిల్ అని ఇప్పటివరకు అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్ర టైటిల్ ను మార్చేసారు. ఈ చిత్రానికి ఇపుడు "జై హో" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రంపై సల్మాన్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.