English | Telugu

సాహసానికి మళ్ళీ బ్రేక్

గోపీచంద్, తాప్సీ జంటగా నటించిన "సాహసం" చిత్ర విడుదల మళ్ళీ వాయిదా వేశారు. జూన్ 28న విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ... మళ్ళీ తాజాగా జూలై 12కు వాయిదా వేశారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్ర విడుదల ఈ విధంగా వాయిదాలు పడుతుండడంతో సినిమాపై ఉండే అంచనాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అదే విధంగా ఈ చిత్రానికి సంబందించిన ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయట్లేదు.