English | Telugu
హిట్ డైరెక్టర్ తో రోషన్ మేకా క్రేజీ మూవీ!
Updated : Oct 5, 2025
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా ఇప్పటికే తన లుక్స్ తో అందరినీ ఫిదా చేశాడు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటూ సోషల్ మీడియాలో సినీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. సరైన సినిమాలు పడితే సక్సెస్ ఫుల్ హీరో అవుతాడనే అభిప్రాయాలున్నాయి. కానీ, రోషన్ మాత్రం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు.
రోషన్ టీనేజ్ లో 'నిర్మలా కాన్వెంట్'(2016) అనే సినిమా చేశాడు. ఆ తర్వాత ఐదేళ్లకు 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. ఆ మూవీ వచ్చి కూడా నాలుగేళ్లు అయిపోయింది. ఇంతవరకు రోషన్ నుంచి మరో మూవీ రాలేదు. ప్రస్తుతం 'ఛాంపియన్' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. అయితే ఈసారి లేట్ చేయకుండా.. తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం.
హిట్ ఫ్రాంచైజ్ తో దర్శకుడిగా శైలేష్ కొలను మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. మధ్యలో 'సైంధవ్' అనే సినిమా చేయగా.. అది మాత్రం నిరాశపరిచింది. అయితే ఇవన్నీ కూడా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లోనే వచ్చాయి. కానీ, ఈసారి రోషన్ కోసం శైలేష్ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని రాశాడంట. ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనుందట. మరి ఈ లవ్ స్టోరీతో రోషన్ సాలిడ్ సక్సెస్ అందుకొని, హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.