English | Telugu
విశాల్ కి తమ్ముడిగా చేయాలనుంది.. చిరంజీవి, ఎన్టీఆర్ తో నటించడమే నా డ్రీం!
Updated : Oct 5, 2025
ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ విట్టా. ఇక ఇండస్ట్రీలో తన సినీ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. "మీ ఫేవరేట్ హీరో ఎవరు అన్న ప్రశ్నకు.. ఫేవరేట్ హీరో అంటూ ఎవరూ లేరు. కానీ చిరంజీవి గారితో, ఎన్టీఆర్ గారితో నటించాలనేది నా డ్రీం. ఇంకో విషయం ఏంటంటే నాకు విశాల్ అన్నకు తమ్ముడిగా చేయాలనుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ నన్ను నువ్వు విశాల్ లా ఉంటావ్ విశాల్ లా ఉంటావ్ అనేవాళ్ళు. విశాల్ అన్నకు మా ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి ఫోన్ చేస్తే ఆయన వాయిస్ విన్నాను. నేనొకటి చెప్తా ఆయనకు. విశాల్ అన్నా నువ్వు నెక్స్ట్ ఏదన్నా సినిమా తీస్తే తమ్ముడు క్యారెక్టర్ కావాలంటే నన్ను పిలువన్నా అంటూ" అంటూ మహేష్ విట్టా తన మనసులో మాటను చెప్పాడు.
ఇక హోస్ట్ వర్ష ఐతే విశాల్ గారు ప్లీజ్ మా మహేష్ కి ఒక తమ్ముడు క్యారెక్టర్ ఇవ్వండి. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారితో నటించాలని నీ డ్రీం త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పింది. ఇక "రవితేజ గారి మాస్ జాతర మూవీ, వరుణ్ తేజ్ గారితో ఒక మూవీ, అలాగే గగన్ విహారి హీరోగా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో చేస్తున్నా. నేను డైరెక్టర్ కావడానికి ఇండస్ట్రీకి వచ్చా. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశా. ఫన్ బకెట్ సిరీస్ కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్లాను. అనుకోకుండా నాతో యాక్ట్ చేయించారు. ఆ ఎపిసోడ్స్ కి మంచి రీచ్ వచ్చింది." అంటూ తన సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు మహేష్ విట్టా.