English | Telugu

"బూతుకథా చిత్రమ్" కాదంట!

"ఈ రోజుల్లో", "బస్‌స్టాప్" చిత్రాలతో మారుతి అంటె బూతుకు మారుపేరుగా ప్రేక్షకులు ఫిక్సయిపోయిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఇటీవల వచ్చిన "ప్రేమకథా చిత్రమ్"లోనీ "ఆ వాసనలు" ఘాటుగానే వెదజల్లాయి. ఈ నేపధ్యంలో.. మారుతి సమర్పణలో వస్తున్న "రొమాన్స్" అనే చిత్రంలో మాత్రం బూతుకు పెద్దపీట వేయకుండా కుటుంబమంతా కలిసి చూసి ఆస్వాదించే విధంగా రూపొందిస్తున్నానని మొత్తుకుంటున్నాడు.

ఆ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న రచయిత "డార్లింగ్" స్వామి. కరుణాకరన్ వద్ద "ఉల్లాసంగా.. ఉత్సాహంగా", "డార్లింగ్" వంటి చిత్రాలకు సంభాషణలందించిన స్వామి.. "డార్లింగ్" అనంతరం తన పేరుకు ముందు "డార్లింగ్"ను యాడ్ చేసేసుకొని "డార్లింగ్ స్వామి" అని పిలిపించుకొంటున్నాడు. ప్రిన్స్ హీరోగా "మారుతి అండ్ కో" నిర్మిస్తున్న "రొమాన్స్" చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న స్వామి.. "రొమాన్స్" చిత్రంలో అశ్లీలత_అసభ్యత అనే ఉండనే ఉండవని ఇప్పట్నుంచి మొత్తుకుంటున్నాడు. ఈ విషయం ఎంతవరకూ నిజయో తెలియాలంటె.. సినిమా విడుదలయ్యేవరకు ఆగాల్సిందే. ఈనెల 29న ఆడియో విడుదల జరుపుకోనున్న "రొమాన్స్" జూలై రెండో వారంలో విడుదల కానుంది!