English | Telugu

వాసు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్..?

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేయ్". వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే విధంగా ఇటీవలే ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తన రెండో చిత్రం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ తన మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రనికి "జోష్" దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.