English | Telugu

మళ్ళీ అదే రిపీట్ చేస్తున్న బన్నీ

బన్నీ హీరోగా నటించిన తాజా చిత్రం "ఇద్దరమ్మాయిలతో". ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ కొత్త గెటప్ తో కనిపించడం, అదే విధంగా మైక్ పట్టుకొని పడటం, వయోలిన్ వాయించడం వంటి కొత్త స్టైల్ తో అభిమానులను అలరించాడు. అయితే ఈ మైక్, గిటార్ మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి.

ప్రస్తుతం బన్నీ నటిస్తున్న చిత్రం "రేసుగుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మిలన్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్ల్స్ మీకోసం...

అయితే ఇందులో ఒక పాట కోసం బన్నీ మరోసారి మైక్ పట్టుకొని, వయోలిన్ కూడా వాయించాడు. మరి ఈ చిత్రం కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంటుందో లేదో త్వరలోనే తెలియనుంది.