English | Telugu

సన్యాసుల్లో కలవనున్న రేణు దేశాయ్.. మరి అకిరా,ఆద్య పరిస్థితి ఏంటి!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పేరు చెప్పగానే అభిమానులతో పాటుప్రేక్షకులకి గుర్తొచ్చేపేరు 'రేణుదేశాయ్'(Renu Desai).అంతలా పవన్ మాజీ వైఫ్ గా గుర్తింపు పొందింది. హీరోయిన్ గా 'బద్రి' తో భారీ సక్సెస్ ని అందుకొని 'జానీ' తర్వాత నటనకి గుడ్ పై చెప్పగా అప్పుడు ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరాలు. ఆ తర్వాత పవన్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేసిన రేణు దేశాయ్ 2012 లో పవన్ నుంచి విడాకులు తీసుకుంది. నటనే తన జీవిత లక్ష్యం కాదని చెప్తుండే రేణు దేశాయ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లోకొన్ని ఆసక్తి కర విషయాలని వెల్లడి చేసింది.

ఆమె మాట్లాడుతు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. చేతిపై స్థిత ప్రజ్ఞ పచ్చబొట్టు కూడా ఉండటంతో పాటు దైవ భక్తి చాలా ఎక్కువ. శివుడు, గణపతికి భక్తురాలిని. దుర్గా మాతని తల్లిగా భావిస్తాను. ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టం. కొన్నేళ్ల తర్వాత సన్యాసం తీసుకుంటాను. పిల్లలు అకీరా, ఆద్య ల బాధ్యతలు మొత్తం తీరిపోయాక, ధ్యానం చేసుకుంటు మిగతా జీవితం గడుపుతానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

కెరీర్ పరంగా చూసుకుంటే రేణు దేశాయ్ ఇరవై ఏళ్ళ తర్వాత 2023 లో రవితేజ(Ravi Teja)హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరావు తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ్నుంచి నటిగా బిజీ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అత్తా కోడళ్ల మధ్య ఎంటర్ టైన్ మెంట్ కోణంలో జరిగే సబ్జెక్టు కాగా, అత్త క్యారక్టర్ లో రేణు దేశాయ్ కనిపించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.