English | Telugu
వెంకీ మామకి హీరోయిన్‌ని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్!
Updated : Oct 21, 2025
ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్.. తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్‌ను ప్రకటించించింది ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ పేరును ఎనౌన్స్ చేసింది.
వెంకటేష్, త్రివిక్రమ్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే ప్రచారం జరిగింది. ఒక హీరోయిన్‌గా త్రిష నటిస్తుందని, మరో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో నిధి అగర్వాల్, శ్రీనిధి శెట్టిలను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను ప్రకటించారు. అక్టోబర్ 21 శ్రీనిధి శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ‘జార్జియస్ అండ్ గ్రేస్ ఫుల్ శ్రీనిధి శెట్టికి ఫెంటాస్టిక్ బర్త్‌డే’ అంటూ విష్ చేసి.. వెంకీ77 సినిమా ప్రయాణంలో జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు మేకర్స్.
కెజిఎఫ్ సిరీస్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. హిట్ ది థర్డ్ కేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన తెలుసుకదా చిత్రంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ సినిమాలలో, వెంకటేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. ‘వెంకీ 77’లో శ్రీనిధి శెట్టి అలాంటి వైవిధ్యమైన పాత్ర చేయబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టాండ్ అవుతుందని అందరూ అంటున్నారు.