English | Telugu
రవితేజ ఖాతాలో మరో డైరెక్టర్
Updated : Jun 26, 2013
పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ.. రవితేజ సినిమా ద్వారా చాలామంది దర్శకులుగా పరిచయమయ్యారు. హరిష్ శంకర్ (షాక్), గోపీచంద్ మలినేని (డాన్ శీను), బోయపాటి శ్రీను (భద్ర) తదితరులను దర్శకులను చేసిన ఘనత రవితేజదే. అప్పటికి తాను స్టార్ కాకపోయినా నేటి అగ్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమైంది.. రవితేజ నటించిన "నీ కోసం" చిత్రంతోనే. ఆ తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో "వెంకీ, దుబాయ్ శీను" చిత్రాలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం రామ్‌చరణ్ "జంజీర్" తెలుగు వెర్షన్ "తుఫాన్"కు దర్శకత్వం వహిస్తున్న యోగి కూడా రవితేజ నటించిన "ఒక రాజు.. ఒక రాణి" చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతగాడు వెంకటేష్‌తో "చింతకాయల రవి" చిత్రం తీసాడు. ఈ డాటా అంతా ఎందుకంటే.. తాజాగా రవితేజ మరో దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు. "బలుపు" చిత్రానికి కథ,మాటలు అందించిన "బాబి" అనే రచయిత రవితేజ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. "బలుపు" ఈనెల 28న విడుదలవుతుండడం తెలిసిందే!