బైసన్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే.. హిందీ, కన్నడ, మలయాళ వారికి భారీ గిఫ్ట్
on Nov 17, 2025

-బైసన్ ఓటిటి డేట్ వచ్చేసింది
-వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీ
-కథ కట్టిపడేస్తుంది
-ధృవ్ విక్రమ్ నటన ప్రధాన హైలెట్
రూరల్ విలేజెస్ లో ఉండే అమాయకపు మనుషులు వాళ్ళ కోపతాపాలు, శతృత్వాల మధ్య ఉన్నత స్థాయి లక్ష్యం కోసం పోరాటం చేసే శక్తీ ఉన్నా కూడా, ఒక అట్టడుగు వర్గానికి చెందిన యువకుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటాడో చెప్పిన తమిళ చిత్రం 'బైసన్'(Bison). చియాన్ విక్రమ్(Vikram)నట వారసుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram)నుంచి వచ్చిన బైసన్ అక్టోబర్ 17 న తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి రిలీజయ్యింది. తెలుగు నాట పర్వాలేదనే టాక్ ని సంపాదించగా తమిళనాట మాత్రం విజయదుంధుబి మోగించింది. ఇప్పటి వరకు సుమారు 70 కోట్ల గ్రాస్ వరకు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల టాక్.
ఇక బైసన్ ఓటిటి వేదికగా ఎప్పుడెప్పుడు అడుగుపెడుతుందా అని ఓటిటి మూవీ లవర్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఓటిటి డేట్ అధికారకంగా వెల్లడి అయ్యింది. ఈ నెల 21 న నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా సదరు సంస్థ వెల్లడి చేసింది. పైగా తమిళ, తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయా లాంగ్వేజెస్ వారికి కూడా బైసన్ రూపంలో సరికొత్త సినీ వినోదం అందడం ఖాయం. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాగా తెరకెక్కిన బైసన్ లో మారి సెల్వరాజ్(Mari selvaraj)దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను ఎంతగానో కట్టిపడేస్తుంది. హృదయాన్ని తాకే సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కందస్వామి, పాండిరాజ్ క్యారెక్టర్స్ లో లాల్, అమీర్ నటన మెస్మరైజ్ చేస్తుంది.
also read: భారతీయ చిత్ర పరిశ్రమకి ఆయనతోనే ఎంతో మేలు..పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
రాణి గా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)క్యారక్టర్ పరిధి తక్కవ ఉన్నా కూడా మెప్పించడంలో మాత్రం రాజీ పడలేదు. అగ్ర దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రానికి ఒక నిర్మాతగా ఉండటం విశేషం. తన స్థాయికి మించి వనతి కిట్టయ్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కబడ్డీ ఆటలో ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ ప్రాసెస్ లో జరిగే కథనాలు మెప్పిస్తాయి. వనతి కిట్టయ్య గా ధృవ్ నటన ఒక రేంజ్ లో కొనసాగుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



