English | Telugu

ఆ క్యారెక్టర్ గురించి రష్మికకు ముందే తెలుసా?

దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు రష్మిక మందన్న. విజయ్ కి పెద్ద‌న్న‌గా ఈ సినిమాలో న‌టించారు శ్రీకాంత్‌. ఆయ‌న‌కు భార్యగా యాక్ట్ చేశారు సంగీత. ఆమె చెల్లెలుగా ఈ చిత్రంలో కనిపించారు రష్మిక మందన్న‌. సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్ర అది. అయితే ఈ విషయం తనకు ముందే తెలుసు అని అంటున్నారు రష్మిక మందన్న. ఇదే విషయం గురించి సెట్లో విజయ్‌తో పలుసార్లు ముచ్చటించానని, తమ మధ్య ఈ సంగతి ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు రష్మిక మందన్న‌.

అయితే తాను విజయ్‌కి ఎప్పటినుంచో ఫ్యాన్ అని, ఆయనతో క‌లిసి తప్పకుండా ఒక్క సినిమాలోనైనా కనిపించాలని ఉండేదని... ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరినందుకు చాలా ఆనందంగా భావించానని చెప్పుకొచ్చారు రష్మిక మందన్న. అన్ని సినిమాల్లోనూ సంపూర్ణమైన పాత్రలు దక్కాలంటే కుదరదని, కొన్ని కమర్షియల్ ఎంటర్‌టైన్ల‌లో ఇలాంటి పాత్రలు చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని చెప్పారు రష్మిక.

సంక్రాంతికి విడుదలైంది వారిసు. అదే చిత్రం తెలుగులో వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తమిళంలో తెర‌కెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రూవ్ చేసుకుంది వారసుడు. ఈ చిత్రంలో రెండు పాటల్లో తాను ఆడిపాడుతున్నందుకు ఆనందంగా ఉన్న‌ట్టు విజయ్‌తో పలుమార్లు చెప్పిన సందర్భాన్ని మళ్లీమళ్లీ గుర్తు చేసుకున్నారు రష్మిక మందన్న. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి రష్మికకు. సౌత్లో వారిసు, ఉత్తరాదిన మిషన్ మజ్ను సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు రష్మిక.

వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని తనకి ఎప్పుడూ ఉంటుందని, పక్కా కమర్షియల్ సినిమాల్లో నటించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి చెప్పారు రష్మిక. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 లో నటిస్తున్నారు రష్మిక మందన్న‌. ఉత్తరాదిన సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ తో న‌టిస్తున్న అనిమ‌ల్‌ చిత్రం కూడా సెట్స్ మీద ఉంది.