English | Telugu

రాణీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్...

గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ ప్రేమజంట రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే సంవత్సరం వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేరు. అయితే ఇటీవలే ఆదిత్య చోప్రా తండ్రి యాశ్ చోప్రా మరణించడం జరిగింది. ఆ సందర్భంలో ఆదిత్య కుటుంబ సభ్యులతో రాణీ ముఖర్జీ బాగా కలిసిపోయిందట. దాంతో ఆదిత్య చోప్రా తల్లీ జ్యోతిష్యులను సంప్రదించి ఆదిత్య, రాణీ ముఖర్జీల వివాహానికి పెళ్లి సంబంధించి పెళ్లి నిశ్చయం చేసేసిందట. మరి త్వరలోనే ఈ విషయాలపై మరిన్ని వార్తలు అధికారికంగా తెలియనున్నాయి.