English | Telugu

"అందాల రాక్షసి"తో రానా కొత్త చిత్రం

రానా హీరోగా త్వరలోనే మరో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "అందాల రాక్షసి" దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడని తెలిసింది.

యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత సురేష్ బాబు నిర్మించనున్నారని. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

రానా ప్రస్తుతం రాజమౌళి "బాహుబలి", గుణశేఖర్ "రుద్రమదేవి" చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ చిత్రాల తర్వాత హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.