English | Telugu

నాకు బీట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా? స్వయంగా చెప్పిన రమ్యకృష్ణ 

తెలుగు చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తు అభిమానులతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందడం హీరో సొంతం మాత్రమే కాదు. హీరోయిన్ల సొంతమని కూడా నిరూపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishna)ఒకరు. తన అందం, నటనతో సిల్వర్ స్క్రీన్ ని మరింత కాంతివంతంగా మార్చగల సమ్మోహన శక్తి రమ్యకృష్ణ సొంతం. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన తన సినీ ప్రస్థానంలో హిట్ ల శాతం చాలా ఎక్కువ. తెలుగు, తమిళ,మలయాళ, హిందీ భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు 300 కి పైగా చిత్రాల్లో నటించింది.


రీసెంట్ గా రమ్యకృష్ణ జీ తెలుగు తో పాటు జీ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న జగపతి బాబు(Jagapathi Babu)టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammuraa)కి గెస్ట్ గా హాజరయ్యింది. ఆదివారం నైట్ టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోని షో నిర్వాహకులు రిలీజ్ చేసారు. సదరు ప్రోమోలో రమ్యకృష్ణ ని ఉద్దేశించి జగపతి బాబు మాట్లాడుతు 'నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్‌ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం లాంటిది చేసారంట కదా అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కంప్లీట్ అవ్వకుండానే రమ్యకృష్ణ మధ్యలో అందుకొని 'ఇన్‌క్లూడింగ్‌ యూ' అని అంది. దీంతో జగపతి బాబు స్మైలింగ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారడంతో ప్రోగ్రాం కోసం ఇరువురు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రమ్యకృష్ణ, జగపతి బాబు జంటగా ఆయనకి ఇద్దరు, జైలర్ గారి అబ్బాయి, బడ్జెట్ పద్మనాభం వంటి హిట్ చిత్రాల్లో నటించి హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సదరు చిత్రాల్లోని సాంగ్స్ నేటికీ నెట్టింట రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు క్యారక్టర్ ఆర్టిస్టుల గాను అగ్ర పదాన దూసుకుపోతున్నారు.