English | Telugu

ఒక్క రాత్రికి మూడు కోట్లు బిజినెస్.. శిల్పాశెట్టి పై ప్రముఖ రచయిత్రి కీలక వ్యాఖ్యలు 

భారతీయ సినీ యవనిక పై ప్రముఖ హీరోయిన్ 'శిల్పాశెట్టి'(Shilpa Shetty)కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకం. ఏ లాంగ్వేజ్ కి చెందిన చిత్రంలో నటించినా, సదరు లాంగ్వేజ్ కి చెందిన సొంత అమ్మాయిలా అనిపించడం శిల్పాశెట్టి నటన కి ఉన్న స్టైల్. ఇందుకు తెలుగులో చేసిన సాహసవీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబు వంటి చిత్రాలే ఉదాహరణ.


రీసెంట్ గా శిల్పాశెట్టి కి సంబంధించిన బాస్టియన్(Bastian)రెస్టారెంట్ గురించి ప్రముఖ రచయిత్రి 'శోభా డే'(Shobhaa De)స్పందించింది. సదరు రెస్టారెంట్ గురించి మొబైల్ జర్నలిజానికి సింబాలిక్ గా భావించే 'మోజోస్టోరీ'(Mojo Story)ద్వారా ఆమె మాట్లాడుతు 'ముంబై(Mumbai)కి సంబంధించిన కొన్ని విషయాలు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తాయి. శిల్పాశెట్టి కి సంబంధించిన బాస్టియన్ రెస్టారెంట్ రాత్రికి రాత్రి రెండు నుంచి మూడు కోట్ల రూపాయిల టర్నోవర్ చేస్తుంది. సాధారణ రోజుల్లో రెండు కోట్లు, వీకెండ్స్ లో మూడు కోట్ల ఆదాయం వస్తుంది. మొదట ఈ న్యూస్ నిజమో కాదో అనుకున్నాను. కానీ నంబర్స్ గురించి స్వయంగా విన్నాను. ఒకసారి నేను కూడా బాస్టియన్ లోపలకి వెళ్లి షాక్ అయ్యా. సుమారు 1400 మంది అతిధులు స్టే చెయ్యడంతో పాటు, ఒకేసారి 700 మంది దాకా భోజనం చేయవచ్చు. ఈ విషయాన్నీ కళ్లారా చూశానని శోభా డే చెప్పుకొచ్చింది.

ముంబై కే చెందిన శోభా డే 1989 నుంచే రచయిత్రిగా అశేష పాఠకుల అభిమానాన్ని పొందింది. ఆమె కలం నుంచి జాలు వారిన ఎన్నో నవలలు విశేష ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.ఇక శిల్పాశెట్టి కొన్ని రోజుల క్రితమే బాస్టియన్ ని మూసివేస్తునట్టు ప్రకటించింది. కాకపోతే ఇదే రెస్టారెంట్ ని బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో ముంబైలోనే ఉన్న జుహు లో తెరవనున్నారు. సినిమాల పరంగా చూసుకుంటే కన్నడ లో' కేడి ది డెవిల్' అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ధ్రువ సర్జా హీరో కాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.