English | Telugu

"బాబాయ్, అబ్బాయ్"ల వార్ !

బాబాయ్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది", అబ్బాయ్ రామ్‌చరణ్ నటిస్తున్న "ఎవడు" చిత్రాలు ఇంచుమించుగా ఒకే సమయంలో షూటింగ్స్ పూర్తి చేసుకొంటున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల మధ్య మినిమం మూడు వారాల గ్యాప్ మెయింటైన్ చేయడం తప్పనిసరి కావడంతో.. ఈ రెండు చిత్రాల విడుదల ఎలా ప్లా చేయాలన్న విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఆగస్టున "అత్తారింటికి దారేది" రిలీజ్ చేసి.. సెకెండ్ శాటర్‌డే, ఆగస్టు 15న సెలవుల్ని క్యాష్ చేసుకోవాలని ముందే డిసైడ్ అయిపోవడంతో.. జూలై రెండోవారంలో "ఎవడు" చిత్రాన్ని విడుదల చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఈనెల 30న ఆడియో విడుదల చేస్తున్నారు. ఒకే కాంపౌండ్‌ నుంచి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం ఇద్దరిఖీ ఎంతోకొంత నష్టాన్ని కలిగిసుంది. వాళ్లకు జరిగే నష్టం కంటె.. వాళ్ల నిర్మాతలకు జరిగే నష్టం ఎక్కువ. అందుకనే "బాబాయ్_అబ్బాయ్"ల మధ్య వార్ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తల్లు తీసుకుటున్నారు!