English | Telugu
బార్ డాన్సర్ గా ప్రియమణి
Updated : Jul 22, 2013
నటిగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న ప్రియమణికి ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన "చెన్నై ఎక్స్ ప్రెస్" చిత్రంలోని ఐటెం సాంగ్ లో నటించి బాలీవుడ్ దర్శక నిర్మాతలను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వచ్చింది.
హిందీలో బార్ డాన్సర్ జీవిత కథతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బార్ డాన్సర్ గా నటించడానికి ప్రియమణికి అవకాశం రాగానే... వెంటనే ఒప్పేసుకుంది. ఈ చిత్రంతో ఎలాగైనా బాలీవుడ్ లో సెగలు పుట్టించాలనే ప్రయత్నంలో ఉన్న ప్రియమణికి ఎలాంటి అవకాశాలు వస్తాయో త్వరలోనే తెలియనుంది.