English | Telugu

ప్ర‌భాస్ ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక‌వుతారు!

ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరో ఎవరంటే ఎక్కువమంది చెప్పే పేరు ప్రభాస్ (Prabhas). ఒక మామూలు హీరోలా ప‌రిచ‌య‌మై, రెబల్ స్టార్ గా ఎదిగి, పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఇండియన్ స్టార్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్, తన మొదటి సినిమాకి ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడో తెలుసా?

2002లో జ‌యంత్ సి. ప‌రాన్జీ డైరెక్ట్ చేసిన 'ఈశ్వ‌ర్' మూవీతో ప్ర‌భాస్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గానే ఆడింది. అయితే తన అందం, కటౌట్, ఎన‌ర్జీతో భ‌విష్య‌త్తులో హీరోగా నిల‌దొక్కుకుంటాడు అనిపించుకున్నాడు ప్ర‌భాస్‌. అనిపించుకుకోవడం ఏంటి? తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు వంద కోట్లకు పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు.

అయితే ప్రభాస్ తన తొలి సినిమా 'ఈశ్వ‌ర్'కి కేవలం రూ.5 లక్షలు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. "ఈశ్వ‌ర్ సినిమాకు నా రెమ్యూన‌రేష‌న్ 5 లక్షలు. దాన్ని ఏం చేశానో కూడా గుర్తులేదు." అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.