English | Telugu

నారా రోహిత్ పెళ్లి డేట్ ఇదే.. స్పెషల్స్ ఇవే  

విభిన్నమైన చిత్రాల్లో నటించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తనకంటు ప్రత్యేక గుర్తింపుని పొందిన హీరో 'నారా రోహిత్'(Nara Rohith).ఈ ఏడాది భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. రోహిత్ కి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ప్రముఖ నటి 'సిరి లేళ్ల'(Siri lella)తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

వీరివురి వివాహం అక్టోబర్ 30న హైదరాబాద్‌(Hyderabad)లో ఘనంగా జరగనుంది. రాత్రి 10 గంటల 35 నిమిషాలకి ముహుర్తాన్ని ఫిక్స్ చేసారు. వివాహ వేడుకల్ని ఐదు రోజుల పాటు జరపనున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 25న హల్దీ వేడుక, అక్టోబర్ 26 రోహిత్ ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం, 28న మెహందీ వేడుక, ఆ మరుసటి రోజు సంగీత్ ఉండబోతుంది. పెళ్లితో పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకి పలువురు సినీ వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

నారా రోహిత్, సిరి కలిసి ప్రతినిధి పార్ట్ 2 లోజంటగా నటించారు. గత సంవత్సరం మే 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిరి అసలు పేరు శిరీష కాగా స్క్రీన్ నేమ్ సిరి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.