English | Telugu

చీటింగ్‌ కేసులో పవర్‌స్టార్‌ అరెస్ట్‌.. రూ.5 కోట్లకు మోసం!

సాధారణంగా కోట్లలో చీటింగ్‌ చేసాడని, పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారని మనకు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా మోసాలు జరగడం అనేది అరుదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో విషయంలో అదే జరిగింది. అతని పేరు ఎస్‌.శ్రీనివాస్‌. ఇప్పటివరకు 60 సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. విశేషం ఏమిటంటే.. తనకు తనే ‘పవర్‌స్టార్‌’ అనే బిరుదు తన పేరు ముందు తగిలించుకున్నాడు. తమిళ ప్రేక్షకులు కూడా అతన్ని పవర్‌స్టార్‌ అనే పిలుస్తారు.

సినిమాలు చేయడంతో పాటు ఒక ఫైనాన్స్‌ కంపెనీని కూడా నడుపుతున్నాడు శ్రీనివాసన్‌. ఆ క్రమంలో ఢల్లీికి చెందిన ‘బ్లూ కోస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌’ సంస్థ 1000 కోట్ల రుణం కోసం శ్రీనివాస్‌ను సంప్రదించింది. లోన్‌ ఇప్పిస్తానని, అందుకుగాను తనకు 5 కోట్లు ఇవ్వాలని అతను అడిగాడు. అడిగినట్టుగానే 5 కోట్లు చెల్లించింది ఆ సంస్థ. నెలరోజుల్లో లోన్‌ వస్తుందని, రాని పక్షంలో తీసుకున్న 5 కోట్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆ సంస్థ డబ్బు చెల్లించి నెలరోజులు దాటిపోయింది. కానీ, లోన్‌ విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్‌ లేకపోవడంతో ఆ సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసును విచారణకు తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ సంస్థ చెల్లించిన 5 కోట్లు శ్రీనివాసన్‌, అతని భార్య ఎకౌంట్‌కు బదిలీ అయినట్టు తమ విచారణలో గుర్తించారు. ఆ డబ్బును తన వ్యక్తిగత అవసరాల కోసం, సినిమాల నిర్మాణానికి వాడుకున్నట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కాకుండా 2018 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు శ్రీనివాసన్‌. దీంతో అతన్ని నేరస్తుడుగా ప్రకటించింది కోర్టు. చివరికి చెన్నయ్‌లో శ్రీనివాసన్‌ను అరెస్ట్‌ చేసి ఢల్లీికి తరలించారు పోలీసులు.

Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.