English | Telugu

పోటుగాడికి సక్సెస్‌ వస్తుందా...

స్టార్‌ వారసునిగా టాలీవుడ్‌ కి పరిచయం అయిన యంగ్‌ హీరో మంచు మనోజ్‌ కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు నటవారసునిగా చిన్నప్పటినుంచే స్క్రీన్‌ మీద కనిపిస్తున్నా హిట్‌ కొట్టటంలో మాత్రం ఇంత వరకు సక్సెస్‌ కాలేదు.

"బిందాస్‌" లాంటి సినిమాలు అడపాదడపా వచ్చినా స్టార్‌ స్టేటస్‌ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైన సక్సెస్‌ కొట్టాలని చేస్తున్న సినిమా పోటుగాడు.

దాదాపుగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న పోటుగాడు ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌. పవన్‌ వడేయార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరగుతున్నాయి.

నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్న ఈ సినిమా రామలక్ష్మీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై లగడపాటి శిరిషా శ్రీదర్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాట మనోజ్‌ పాడగా, మరోపాటను శింబు పాడటం విశేషం.. ఈ రెండు పాటలు సినిమాకే హైలెట్‌ అవుతాయంటున్నారు చిత్రయూనిట్‌. మరి ఈ సినిమా అయిన మనోజ్‌కు ఆశించిన సక్సెస్‌ ఇస్తుందో లేదో తెలియాలంటే మాత్రం రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.