English | Telugu

డబ్బులు ఇవ్వకుండా వాడుకుంటున్నారంటున్న పాయల్

డబ్బులు ఇవ్వకుండా వాడుకుంటున్నారంటున్న పాయల్

ఆర్ ఎక్స్ 100 తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన నటి పాయల్ రాజ్ పుత్(payal rajput) అది  ఎంతలా అంటే ఆమె సినిమాలో ఉంటే  చాలు హీరోతో అవసరం లేనంతలా.హీరోలకి ఉన్నట్టే తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది.బి సి సెంటర్స్ లో అయితే ఆమె ప్రభావం మరింత ఎక్కువ. అందుకే తనని ప్రధాన పాత్ర చేసుకొని సినిమాలు తెరకెక్కుతున్నాయి. గత ఏడాది వచ్చిన మంగళవారం సినిమానే అందుకు ఉదాహరణ. తాజాగా ఆమె ఇనిస్టాగ్రామ్ లో  చేసిన ఒక పోస్ట్  పెద్ద దుమారాన్నే లేపుతుంది.

రక్షణ(rakshana)యువసామ్రాట్ అక్కినేని నాగార్జున (nagarjuna)పోలీసు ఆఫీసర్ గా నటించిన మూవీ టైటిల్ కదా అని అనుకోకండి. ఇప్పుడు ఈ టైటిల్ తోనే పాయల్ ఒక మూవీ చేస్తుంది. పైగా తను కూడా పోలీసు ఆఫీసరే. ఇప్పుడు ఈ మూవీ గురించే ప్రస్తావిస్తునే నాకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఇనిస్టా లో పోస్ట్ చేసింది. దాంతో పాటుగా సినిమా కూడా వాయిదా పడుతున్నట్టు కూడా  చెప్పింది. రక్షణ మూవీని ఉద్దేశించి చెప్పిందనే విషయం  క్లియర్ గా అర్ధమవుతుంది.  అభిమానులు కూడా పాయల్ కి మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆల్రెడీ  మేకర్స్ నుంచి  రక్షణ రిలీజ్ జూన్ 7 న అని వచ్చిన నేపథ్యంలో పాయల్ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి టీం నుంచి  ముందు ముందు ఎలాంటి అప్ డేట్ వస్తుందో చూడాలి

ఇక కొన్ని రోజుల క్రితం వచ్చిన పాయల్  ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.పోలీసు ఆఫీసర్ గెటప్ లో ఉన్న  లుక్ తో  ఒక కొత్త  పాయల్ ని చూడబోతున్నామనే విషయం అర్ధమవుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రణ దీప్ ఠాకూర్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రోషన్, రాజీవ్ కనకాల, వినోద్ బాల వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మణి శర్మ తనయుడు మహతి సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రాజన్న ,గ్రీకు వీరుడు, బాణం లాంటి సినిమాలకి ఫొటోగ్రఫీ ని అందించిన అనిల్ బండారి కెమెరామెన్ గా నటించడం విశేషం

 

డబ్బులు ఇవ్వకుండా వాడుకుంటున్నారంటున్న పాయల్