English | Telugu
పవన్ బుల్లెట్టుకి చరణ్ సౌండ్ బంద్
Updated : Jul 15, 2013
మెగావార్ మొదలయ్యిందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే ఉంది. రాంచరణ్ నటిస్తున్న "ఎవడు" చిత్ర పాటలు, ట్రైలర్స్ ఇటీవలే విడుదలయ్యి, మంచి టాక్ సంపాదించుకుంది. మరి పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రం ఎలా ఉండబోతుందో, పాటలు ఎలా ఉంటాయో అని మెగా అభిమానుల్లో ఉత్కంట మొదలయ్యింది. అసలే "ఎవడు" ఆడియో ఫంక్షన్ లో పవన్ కోసం రచ్చ రచ్చ చేసిన పవన్ అభిమనులకీ, తమ హీరో సినిమా ట్రైలర్ విడుదల అవుతుందంటే ఇంకెలా ఉంటారో చెప్పండి!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది" చిత్రం యొక్క చిన్న సాంపుల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక అంతే.. ఖేల్ ఖతం అన్ని సౌండ్స్ బంద్. ఆ ట్రైలర్ లో కేవలం పవన్ నడుచుకుంటూ వచ్చే ఒకే సీన్ మాత్రమే ఉండటంతో పాటు,
"వీడు ఆ...రడుగుల బుల్లెట్టు.....
వీడు ధైర్యం పంపిన రాకెట్టు ...."
అనే రెండు లైన్లు మాత్రమే ఉంది. దీనికే మెగా అభిమానులు మొత్తం ఫుల్ ఖుషిలో ఉన్నారు. నిజానికి ఈ ట్రైలర్ చూస్తే "ఎవడు" చిత్రం యొక్క అన్ని ట్రైలర్స్ కంటే సూపర్ గా ఉంది. మరి ఇంకేముంది మెగా అభిమానుల్లో వార్ ప్రారంభమైనట్లేనా? ఏమో ఎవరికి తెలుసు...