English | Telugu

సమంతకు పవన్ హితబోధ

పవన్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ సినిమా విడుదల విషయంలో కాస్త నిరాశగా ఉన్నా కాని.. వారి సంతోషం కోసం ఆ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క ఫోటోలను మెల్లిగా నెట్ లోకి విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "అత్తారింటికి దారేది" చిత్రం కోసం అభిమానులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. కనీసం ఆ సినిమాకు సంబంధించిన పాటలు ఎప్పుడూ విందామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇదివరకే నెట్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అయితే తాజాగా...మరి కొన్ని స్టిల్ల్స్ మీకోసం.

పవన్ తన తోటి నటీనటులతో కలిసి "అత్తారింటికి దారేది" సెట్స్ లో ఉన్న ఫోటో. అదే విధంగా సమంతకు ఏదో హితబోధ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ ఫోటోలు అభిమానుల్లో మరింత ఉత్సహాన్ని నింపుతున్నాయి.ఈ చిత్రంలో పవన్ పూర్తిగా నవ్విస్తూ, తనదైన మాస్ ను కూడా చూపించనున్నాడని తెలుస్తుంది. మరి చూద్దాం.. "అత్తారింటికి దారేది" చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.