English | Telugu
టాలీవుడ్ ట్రెండ్ సెట్ హీరో
Updated : Jul 23, 2013
"నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను... సినిమా మొత్తం ఆయన నడిస్తే చాలు" అని "అత్తారింటికి దారేది" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో సమంత మాట్లాడిన మాటలివి. నిజమే మరి! పవన్ కళ్యాణ్ తన సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ, గెటప్, యాక్టింగ్, స్టైల్.. ఒక్కటేమిటి.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి విషయంలో ట్రెండ్ సెట్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.
పవన్ నటించిన "బద్రి", "ఖుషి", వంటి చిత్రాల నుండి మొన్నటి "గబ్బర్ సింగ్", "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రాల వరకు కూడా తన స్టైల్ ను కాలనుసరంగా మార్చుకుంటూ, రాబోయే కాలానికి ఒక ట్రెండ్ ను సెట్ చేస్తున్నాడు.