English | Telugu
ఆటోడ్రైవర్ గా పవర్ స్టార్
Updated : Jul 19, 2013
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "అత్తారింటికి దారేది". ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక చిన్న విషయం కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో పవన్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తబోతున్నాడట. తాతయ్యతో గొడవపడి దూరంగా ఉంటున్న అత్తమ్మను దగ్గర చేసే పాత్రలో పవన్ నటించనున్నాడట. దీనికి మరదలు పిల్ల సమంత కూడా పవన్ కు సహాయం చేస్తుందని సమాచారం.
ఇవన్నీ ఎలా ఉన్న కూడా ఈ సినిమా విడుదలకు ముందే జనాల్లో ఇంత స్పందన వస్తుండటంతో సినిమాపై ఉన్న భారీ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.