English | Telugu

ప్రత్యేకత చాటుకొన్న పవర్‌స్టార్

కేధార్‌నాధ్ బాధితుల సహాయార్ధం పాతిక లక్షల విరాళం ప్రకటించడం ద్వారా తన ప్రత్యేకతను చెప్పకనే చెప్పుకొన్నారు పవన్‌కళ్యాణ్. ఈ విషయమై తొలుతగా స్పందించి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన హీరో పవన్‌కళ్యాణ్ మాత్రమే. పవన్‌కళ్యాణ్ నుంచి స్ఫూర్తి పొంది‍.. రామ్‌చరణ్,అల్లు అర్జున్‌లు కూడా చెరో పది లక్షలు చెక్కులను అందించారు. మరోవైపు తమిళ హీరో సూర్య కూడా పది లక్షల విరాళం ప్రకటించడంతో.. నేటి నుంచి కేధార్‌నాధ్ సహాయ చర్యల నిమిత్తం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి విరాళాలు వెల్లువెత్తనున్నాయి.

మురళీమోహన్ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లక్ష రూపాయల విరాళం అందించారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ పాతిక లక్షలు ప్రకటించి ఉన్న నేపధ్యంలో.. మహేష్‌బాబు, ఎన్టీఆర్ కూడా అంతే మొత్తంలో, లేదా అంతకుమించి కొంచెం ఎక్కువ మొత్తంలో విరాళాలు ప్రకటించే అవకాశముంది. మరి "కోటి రాగాలు" పలికే మన హీరోయిన్లు కూడా ఈ విషయమై ముందుకు వస్తే బాగుంటుంది!