English | Telugu

ఇక్కడ కూడా పరదేశియే

"వాడు-వీడు" వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పరదేశి". తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. అధర్వ, వేదిక, ధన్సిక, ఉమా రియాజ్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోను వచ్చే నెలలో విడుదల చేసి.. ఆగష్టులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి.