English | Telugu
"ఓం" ఓహో అనిపిస్తేనే..?
Updated : Jul 6, 2013
నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్ పీక మీద కత్తి వేలాడుతోంది. "కత్తి" అనంతరం కళ్యాణ్‌రామ్ నటిస్తూ నిర్మిస్తున్న "ఓం" చిత్రం ప్రేక్షకులతో "ఓహో" అనిపించకపోతే ఆయన కెరీర్ క్లిష్ట దశకు చేరుకుంటుంది. "ఓం" చిత్రం కళ్యాణ్‌రామ్ పదో చిత్రం. హీరోగా కళ్యాణ్‌రామ్ వయసు కూడా పదేళ్ళు. ఈ పదేళ్లలో కళ్యాణ్‌రామ్ చేసిన పది చిత్రాల్లో విజయం సాధించిన చిత్రం ఒకటే ఒకటి. అది "అతనొక్కడే". ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సురేంద్రరెడ్డి ఇప్పుడు "నాలుగైదు కోట్ల డైరెక్టర్"గా మారాడు. కానీ కళ్యాణ్‌రామ్ కెరీర్ మాత్రం "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్న చందాన ఉంది.
"తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా పరిచయమైన కళ్యాణ్‌రామ్, ఆ తర్వాత "అభిమన్యు" అనే చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. మూడో చిత్రం "అతనొక్కడే" అనూహ్య విజయం సాధించింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన "అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీ కళ్యాణం, హరే రామ్, జయూభవ, కత్తి" చిత్రాలు కళ్యాణ్‌రామ్‌కు నిరాశనే మిగిల్చాయి. దాంతో తాజా చిత్రం "ఓం" విజయం సాధించడం ఆయనకు ఎంతైనా అవసరం. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. పూర్తి ౩డి చిత్రంగా రూపొంది ఈనెల 19న వస్తున్న "ఓం" ఆడియన్స్‌ను ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే!