English | Telugu
"ఓరి భగవంతుడా" అనేదెవరు ?
Updated : Jul 5, 2013
హిందీలో అక్షయ్‌కుమార్ నిర్మించి, నటించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆ మధ్య పలువురు దర్శకులు, నిర్మాతలు పలు ప్రయత్నాలు చేసారు. ఒకరిద్దరు అగ్ర కథానాయకులు కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపారు. అయితే, కారణాలేవైనప్పటికీ అవేవీ ఆచరణరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత "ఓ మై గాడ్" రైట్స్ సొంతం చేసుకొని, ఓ ప్రముఖ హీరోతో దాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రకృతి వైపరిత్యం కారణంగా తన జీవనాధారమైన షాపును పోగొట్టుకున్న ఓ వ్యక్తి.. దేవుడి మీద కేసు వేయడం "ఓ మై గాడ్" ఇతివృత్తం. యాక్ట్ ఆఫ్ గాడ్ (భగవంతుని లీల)కు క్లెయిమ్ వర్తించదని ఇన్స్యూరెన్స్ కంపెనీ తేల్చి చెప్పడంతో భగవంతుడ్ని ముద్దాయిగా ఆరోపిస్తూ కేసు పెడతాడు ఓ వ్యక్తి. దాంతో సాక్ష్యాత్తూ భగవంతుడే భూమ్మీదకు దిగి వస్తాడు. మానవరూపంలోని భగవంతుడిగా అక్షయ్‌కుమార్ నటించగా.. భగవంతుడి మీద కేస్ పెట్టే వ్యక్తి పాత్రను పరేష్ రావల్ పోషించారు!