English | Telugu

సూర్యని భయపెడుతున్న ఎన్టీఆర్..!

తమిళ హీరో సూర్యని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భయపెడుతున్నాడట. యంగ్ టైగర్ 'రభస' చేస్తే తట్టుకోవడం కష్టమని సూర్య కూడా డిసైడ్ అయ్యాడట. అందుకే ఇప్పుడు రభస రిలీజ్ డేట్ కోసం సూర్య ఎదురుచూస్తున్నాడు. సూర్య తమిళంలో నటించిన అంజాన్ సినిమా తెలుగులో సికందర్ గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15నవిడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే అదే రోజున ఎన్టీఆర్ రభస విడుదల చేస్తామని బెల్లంకొండ సురేష్ ఆడియో ఫంక్షన్ లో ప్రకటించారు. అందుకే ఇప్పుడు సికందర్ భయపడుతున్నాడు. కానీ ఇప్పుడు రభస వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దీంతో సికందర్ టీం అయోమాయంలో పడింది. ఒకవేళ రభస వాయిదా పడితే తన సికిందర్ కి పోటీ వుండదని కానీ ఒకవేళ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే తమకు కష్టమని వారు అనుకుంటున్నారు. ఇలా ఎన్టీఆర్ తన 'రభస' రిలీజ్ డేట్ ఖరారు చేయకుండా సికందర్ ని భయపెడుతున్నారు.