English | Telugu
'లెజెండ్'తో అల్లుడు శ్రీను సినిమా..!
Updated : Aug 6, 2014
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన “అల్లుడు శీను” చిత్రం ఈ మధ్యనే విడుదలయ్యి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో తరువాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తన తరువాత సినిమా “లెజెండ్” డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అల్లుడు శీను మూవీలాగే ఈ సినిమా కూడా హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.