English | Telugu

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ రెడీ.. నో ఇండోర్‌.. ఓన్లీ ఔట్‌డోర్‌!

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ రెడీ.. నో ఇండోర్‌.. ఓన్లీ ఔట్‌డోర్‌!

కె.జి.ఎఫ్‌. సిరీస్‌, సలార్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఏ రేంజ్‌కి వెళ్లిపోయాడో అందరికీ తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర వంటి వరస సూపర్‌హిట్స్‌తో తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్‌. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసిన రోజు నుంచీ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వస్తుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. 

కొద్దికాలంగా ఈ సినిమా షూటింగ్‌ మొదలు కాబోతోంది అంటూ పలు వార్తలు వచ్చాయి. కానీ, అది కార్యరూపంలోకి రాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ వార్తకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సినిమా కోసం ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా, గోవా, శ్రీలంకలతోపాటు మరికొన్ని ప్రదేశాల్లో ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. టోటల్‌గా షూటింగ్‌ అంతా ఔట్‌డోర్‌లోనే జరుగుతుందట. ఇన్‌డోర్‌ షూటింగ్‌ అనేది ఉండదని తెలుస్తోంది. 

ఫిబ్రవరి చివరలో షూటింగ్‌ ప్రారంభించినప్పటికీ ఎన్టీఆర్‌ మాత్రం మార్చిలోగానీ, ఏప్రిల్‌లోగానీ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌ మూవీ ‘వార్‌2’లో ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అది కంప్లీట్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ తన పూర్తి  సమయాన్ని ప్రశాంత్‌ నీల్‌ సినిమాకి కేటాయిస్తారని తెలుస్తోంది. ‘వార్‌2’ చిత్రాన్ని ఆగస్ట్‌ 14న విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ‘డ్రాగన్‌’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సాధారణంగా ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాల షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ, ఈ సినిమా షూటింగ్‌ని యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేసి 2026 జనవరి 9న రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశారు. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ని కూడా ఎనౌన్స్‌ చేసిన మేకర్స్‌ దాన్ని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.