English | Telugu

దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ తనయుడు!

శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్‌, జయం మనదేరా, భద్రాచలం, జై బోలో తెలంగాణ వంటి విజయవంతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు దర్శకుడు ఎన్‌.శంకర్‌. అప్పట్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందాయో తెలిసిందే. ఇప్పుడు ఎన్‌.శంకర్‌ తనయుడు దినేష్‌ మహీంద్ర తండ్రి బాటలో దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి రెడీ అయ్యాడు.

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తిచేశాడు దినేష్‌ మహీంద్ర. త్వరలోనే దినేష్‌ మహీంద్ర దర్శకత్వంలో ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ రూపుదిద్దుకోబోతుంది. నూతన తారలతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్‌ ఫీల్‌ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.