English | Telugu

రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ రావడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కరాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad)కి పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు డిప్యూటీ సీఎం పవన్ కి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు పవన్ కళ్యాణ్. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ పురస్కారం రావడం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మీరు సినిమాల్లో పండించే హాస్యం, చూపించే నటన ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పురస్కారం మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Also Read: మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.