English | Telugu
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు!
Updated : Feb 7, 2025
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరును దుర్వినియోగం చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన అనిల్ మిశ్రా, అతని కుమారుడు అభిషేక్, మరో వ్యక్తి కలిసి దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో అవార్డుల వేడుక నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఫోటోలను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు నమ్మించి.. పలు సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అలాగే అవార్డులను అమ్ముకోవడంతో పాటు, ఈవెంట్ కి హాజరయ్యే వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. బీజేపీ ఫిల్మ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సమీర్ దీక్షిత్ ఫిర్యాదుతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.