English | Telugu
పాపం రకుల్.. వాట్సాప్ దెబ్బకు కొత్త తలనొప్పి!
Updated : Nov 25, 2025
హీరోయిన్లకు కొత్త తలనొప్పి
ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్స్ తో ఇబ్బందులు
పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా.. టెక్నాలజీ పెరిగే కొద్దీ, సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు హీరోయిన్లకు తలనొప్పిగా మారాయి. ఇప్పుడు ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్స్ తో కొత్త తలనొప్పి వచ్చింది.
హీరోయిన్ల ఫొటోలతో కొందరు ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత.. సినిమా వాళ్ళకి, సన్నిహితులకు మెసేజ్ లు చేసి.. ప్రొఫెషనల్, పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఎవరో ఒక హీరోయిన్ పేరుని వాడుకొని మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: 'రాజు వెడ్స్ రాంబాయి' అసలు కలెక్షన్స్ ఇవే..!
ఈ ఫేక్ వాట్సాప్ బాధితుల్లో ఇప్పటికే రుక్మిణి వసంత్, అదితిరావు హైదరీ, శ్రియా శరణ్ వంటి వారు ఉన్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ లిస్టులో చేరింది. "నా ఫొటో పెట్టుకొని, ఎవరో వాట్సాప్ లో నాలాగా చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ వాట్సాప్ నెంబర్ నాది కాదు, ఏదైనా మెసేజ్ వస్తే బ్లాక్ చేయండి" అంటూ రకుల్ సోషల్ మీడియా వేదికగా సన్నిహితులను అలెర్ట్ చేసింది.
నిజానికి ఇది చాలా పెద్ద ఇష్యూ. హీరోయిన్ ఫోటో పెట్టుకొని, ఆమె పేరుతో ఏవైనా బ్యాడ్ మెసేజ్ లు పెడితే.. అనవసరంగా చెడ్డపేరు వస్తుంది. తమ ప్రమేయం లేని, ఈ ఫేక్ వాట్సాప్ చాట్ వల్ల.. హీరోయిన్లకు సన్నిహితులతో విభేదాలు రావచ్చు, సినిమా అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. అందుకే ఈ ఫేక్ వాట్సాప్ అనేది ఇప్పుడు పెద్దగా తలనొప్పిగా మారింది.