English | Telugu

అఖండ 2 ప్రీమియర్ కి పవన్ కళ్యాణ్! ప్లేస్ చెప్తారా!

-అభిమానుల హంగామా
-పవన్ చూసేది ఎక్కడ
-జాతర కి టైం స్టార్ట్


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం 'బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపాన్ని మరోసారి వీక్షించడానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు నైట్ నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండటంతో థియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం మొదలయ్యింది. నిజం చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ డేట్ కి రెండు రోజుల ముందు నుంచే థియేటర్స్ ని డెకరేషన్ చేసి ప్రతి రోజు థియేటర్ కి వెళ్లి కొత్త రిలీజ్ డేట్ కోసం పడిగాపులు కాసారు. బాలయ్య అంటే వాళ్ళకి అంత అభిమానం. ఇప్పుడు ఆ అభిమానాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అఖండ 2 ప్రీమియర్ చూడబోతున్నాడని, మోస్ట్ లీ విజయవాడలోనే చూడబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ న్యూస్ పై ఇద్దరు అభిమానులు స్పందిస్తు 'అఖండ 2 ని పవన్ కళ్యాణ్ ప్రీమియర్ రోజు గాని లేదా ప్రత్యేకంగా షో వేయించుకొని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ చాలా రోజుల నుంచి అన్ని మతాలని, ప్రజలని ఒకేలా ఆదరించే సనాతన ధర్మాన్ని తన భుజ స్కందాలపై వేసుకొని సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్తూ వస్తున్నాడు.

also read: చిరంజీవిగా రాలేదు.. పరిశమ్ర వ్యక్తిగా వచ్చాను

ఇప్పుడు అఖండ 2(Akhanda 2)లో బాలయ్య కూడా సనాతన దర్మం యొక్క విశిష్టితని తన క్యారక్టర్ ద్వారా చెప్తూ వస్తున్నాడు. మూవీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా సనాతన ధర్మమే. దీంతో పవన్ అఖండ 2 చూడటం గ్యారంటీ అని అంటున్నారు. పైగా పవన్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం. బాలకృష్ణ తన సహచర ఎంఎల్ఏ అనే విషయాన్నీ కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. పవన్, బాలకృష్ణ ఒకరికొకరు సోదర భావంతో మెదులుతూ ఉంటారనే విషయం కూడా తెలిసిందే.