English | Telugu
మరో వారసుడొస్తున్నాడు
Updated : Jul 3, 2014
హిందీ, తెలుగు, తమిళం తేడా లేకుండా నటవారసత్వం సినీ పరిశ్రమలో కొనసాగుతూనే వుంది. లేటెస్టుగా తెలుగు చిత్రసీమలోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 80, 90 దశకాల్లో హీరోగా విజయాలు సాధించిన నరేష్ పుత్రుడు నవీన్ తెలుగు తెరకు పరిచయం కావడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ కొత్త హీరో కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకత్వంలో, చంటి అడ్డాల నిర్మించనున్న చిత్రం ద్వారా పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కొడుకుని హీరోగా చూసుకోవాలనేది నరేష్ కోరికట. నట వారసత్వం గల కుటుంబం నుంచి వచ్చిన నవీన్ తండ్రి కోరికతో తీర్చడంతో పాటు అభిమానుల అభిమానం చూరగొంటాడో లేదో చూడాలి.