English | Telugu

నిర్మాతకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్


ఇప్పుడు టాలీవుడ్ న్యూస్‌లో అంతటా టాప్ లో కొనసాగుతున్న అంశం ఒక్కటే. మహేష్ బాబు తొలిసారిగా ఆతిధి పాత్రలో కనిపిస్తుండటం. ఆయన బంధువు, స్వయానా బావమరిది సుధీర్ కోసం మహేష్ ఈ పని చేయబోతున్నారు. బావమరిది సుదీర్ బాబు తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఇందులో మహేష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. ఈ విషయాన్నే అబ్బురంగా చెప్పుకుంటున్న టాలీవుడ్ వర్గాలకు తాజాగా మరో విషయం తెలిసింది. గెస్ట్ రోల్ లో నటించేందుకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవటం లేదట.


మహేష్ కాల్షీట్స్ కోసం బడా నిర్మాతలు క్యూలు కట్టి వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ప్రిన్స్ కి ఎన్నో వర్తమానాలు అందుతున్నాయి. అంత క్రేజ్ వున్న మహేష్ ఫ్రీగా నటిస్తానంటే నిర్మాతకు ఇంత కన్నా తీపి పండుగ ఏం వుంటుంది.. కన్నడలో హిట్ అయిన చార్మినార్ సినిమాకు ఇది రిమేక్. దానికి దర్శకత్వం వహించిన చందూ తెలుగూ రీమేక్ కూడా పనిచేస్తున్నారు. గతంలో వచ్చిన సుధీర్ చిత్రాలకు పబ్లిసిటీ విషయంలో మహేష్ సహకరించిన విషయం తెలిసిందే.