English | Telugu
ప్రపంచ శృంగార దేవత ఆమే ..
Updated : Jul 3, 2014
బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనె అరుదైన కితాబునందుకున్నారు. ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో ప్రపంచ శృంగార దేవత టైటిల్ ను దీపికా సొంతం చేసుకున్నారు. సెక్సీయస్ట్ ఉమెన్ ఆఫ్ వరల్డ్ పేరిట నిర్వహించిన ఈ పోల్‌లో దీపికకు అత్యధిక ఓట్లు లభించాయి. త్వరలో వెలువడనున్న మ్యాగజైన్ లో 100 శృంగార మహిళల జాబితాను విడుదల చేయనున్నారు. ఈ మ్యాగజైన్ కవర్ పేజీని దీపిక అలకరించనుంది.
మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన దీపికకు అనతి కాలంలోనే సినీ అవకాశాలు వచ్చాయి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా కనిపించిన దీపిక ఆ తర్వాత ఎన్నో బ్రాండ్ లకు ప్రమోటర్ గా వ్యవహరించింది. తనకూ ఈ టైటిల్ రావడానికి మోడలింగ్, సినీ రంగాల ద్వారా లభించిన గుర్తింపే కారణమంటోంది దీపిక. కేవలం శరీర సౌష్టవం వలన ఈ టైటిల్ దక్కదని ఆమె చెప్పుకొచ్చింది. ఏమైనా బాలీవుడ్ భామ ప్రపంచ శృంగార సుందరి అనిపించుకోవటం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు