English | Telugu
నారా రోహిత్ కొత్త సినిమా
Updated : Jun 26, 2013
నారా రోహిత్ హీరోగా మరొక కొత్త చిత్రం తెరకెక్కనుంది. ప్రశాంత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఫిల్మ్ నగర్ దేవాలయంలో జరిగాయి. ఈ చిత్రంలో శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది.
యాక్షన్ తో పాటుగా సాగే మంచి రొమాంటిక్ చిత్రంగా రూపొందనుంది. సుధా సినిమాస్ బ్యానర్ లో జె. సాంబశివ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ "శంకర" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.