English | Telugu
రామ్, శ్రీలీల ఇచ్చిపడేసారుగా.. "గండరబాయ్" సాంగ్ మాములుగా లేదురా బై!
Updated : Aug 19, 2023
రామ్, శ్రీలీల.. ఇద్దరూ ఇద్దరే. ఇటు నటనలోనూ, అటు నర్తనలోనూ ఇచ్చిపడేసే తారలే. అలాంటి ఈ ఇరువురి కలయికలో వస్తున్న తొలి చిత్రం 'స్కంద'. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీ.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న జనం ముందుకు రానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే, ఆ మధ్య "నీ చుట్టు చుట్టూ" అంటూ సాగే ఫస్ట్ సింగిల్ తో ఇంప్రెస్ చేసిన 'స్కంద' యూనిట్.. తాజాగా సెకండ్ సింగిల్ తో యూట్యూబ్ ముంగిట సందడి చేసింది. "గంట కొట్టి సెప్పుకో.. గంట కొట్టి సెప్పుకో.. గంటలోనే వస్తనే గండర గండరబాయ్.. గజ్జెకట్టి సెప్పుకో.. గాజులెట్టి సెప్పుకో.. గాలివాన తెస్తనే గండర గండరబాయ్.." అంటూ మొదలయ్యే ఈ జానపదశైలి గీతం వినగానే ఆకట్టుకునేలా ఉంది. రామ్, శ్రీలీల చిందులు, తమన్ బాణీ, అనంత శ్రీరామ్ సాహిత్యం, నకాష్ అజీజ్ - సౌజన్య భాగవతుల గానం, విజువల్స్.. వెరసి 'గండరబాయ్'ని కాస్త ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిపాయి. మరి.. తొలి, మలి గీతాలతో అలరించిన 'స్కంద' బృందం.. రాబోయే పాటలతోనూ అదే పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.