English | Telugu
ఆగస్టు 1న "భాయ్" ఫస్ట్ లుక్
Updated : Jul 26, 2013
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "భాయ్". వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నారని తెలిసింది. ఓ భారీ సెట్ సాంగ్ తప్ప షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని, ఈ సాంగ్ ను ఆగస్టు లో చిత్రీకరించనున్నారని తెలిసింది.
పూర్తి కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ్ నటిస్తుంది. కామ్నా జేత్మలాని, ప్రసన్న కుమార్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.