English | Telugu

కుంభమేళ మోనాలిసా తెలుగు మూవీ స్టార్ట్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందా!


-మోనాలిసా మూవీ స్టార్ట్
-సినిమా పేరు లైఫ్
-సాయి చరణ్ హీరో
-పాన్ ఇండియా సినిమా అవుతుందా!


కుంభమేళ'(Kumbh Mela)అనగానే ఎన్నో విశేషాలు గుర్తుకు వస్తుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని 'మోనాలిసా'(Monalisa)కూడా ఒక విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూపీ కి చెందిన మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుంటూ ఉంటే, కొంత మంది ఆమెలో ఉన్న ప్రత్యేక అందానికి ముగ్దులయ్యారు. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రత్యేకమైన నయనాలతో, నవ్వుతో, చూపులతో ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా మారింది.

రీసెంట్ గా మోనాలిసా హీరోయిన్ గా తెలుగులో ఒక మూవీ స్టార్ట్ అయ్యింది. 'లైఫ్'(Life)అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా సాయిచరణ్(Sai Charan)హీరోగా చేస్తున్నాడు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలతో మేకర్స్ సినిమాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతు హైదరాబాద్(Hyderabad)కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోను తెలుగు సినిమా చేయడం మరింత ఆనందంగా ఉంది. ఇంకా తెలుగు నేర్చుకోలేదు. త్వరలోనే తెలుగు నేర్చుకుంటానని చెప్పింది. మోనాలిసా మాట్లాడిన ఈ మాటలు తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Also read:సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా! అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్!

కొంత మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మోనాలిసా కి తెలుగు సినిమా వెల్ కమ్ చెప్తుంది. హీరోయిన్ గా రాణించాలని అంటు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. మరి సోషల్ మీడియా వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన మోనాలిసా, తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. మోనాలిసా రాకతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారే అవకాశం కూడా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోస్థుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లైఫ్ కి శ్రీను కోటపాటి(Srinu Kotapati)దర్శకుడు. వెంగమాంబ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతుంది.