English | Telugu

ఒక్క ట్వీట్ తో మళ్ళీ వార్తల్లోకి బండ్ల గణేష్.. ఆ హీరోనే టార్గెట్ చేశాడా..?

బండ్ల గణేష్ మైక్ పట్టుకొని మాట్లాడాడంటే.. వైరల్ అవ్వడమో, వివాదం అవ్వడమో కామన్ అయిపోయింది. ఇటీవల 'కె-ర్యాంప్' సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ వివాదానికి దారి తీసింది. ఆ ఈవెంట్ లో ఆయన విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి విమర్శలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ కీలక ప్రకటన చేశాడు. (Bandla Ganesh)

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రీసెంట్ హిట్ ఫిల్మ్ 'కె-ర్యాంప్' సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన బండ్ల గణేష్.. కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ, పరోక్షంగా విజయ్ పై విమర్శలు చేసినట్లు అనిపించింది.

"మిడిల్ క్లాస్ కి చెందిన కిరణ్, హీరో కావాలని కలలు కని దానిని నిజం చేసుకున్నాడు. కిరణ్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక్క సినిమా హిట్ కాగానే 'వాట్సాప్ వాట్సాప్' అని మాట్లాడుతుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్, కొత్త కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాప్, కళ్ళకి అద్దాలు పెట్టుకొని తిరిగే ఈ రోజుల్లో.. మన ఇంట్లో కుర్రాడిలా కిరణ్ సింపుల్ గా ఉంటాడు. కిరణ్ ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ ని చూసి నేర్చుకోవాలి. కొత్త వాళ్ళకి అవకాశమివ్వాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే.. మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళా?. మీరూ ఒకప్పుడు కొత్త వాళ్ళే.. గతాన్ని మర్చిపోవద్దు." అని కె-ర్యాంప్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడాడు.

సినిమా వేడుకల్లో "వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్" అంటూ విజయ్ తన అభిమానుల్లో జోష్ పెంచుతాడు. దీంతో "వాట్సాప్ వాట్సాప్" అని బండ్ల చేసిన వ్యాఖ్యలు.. విజయ్ ని టార్గెట్ చేసినట్టు ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. అలాగే, కెరీర్ స్టార్టింగ్ లో కొత్త దర్శకులతో వర్క్ చేసిన విజయ్.. ఇప్పుడు చెయ్యట్లేదు. ఆ విషయాన్ని కూడా బండ్ల ప్రస్తావించి.. పరోక్షంగా విజయ్ ని విమర్శించాడనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

'కె-ర్యాంప్ సక్సెస్ మీట్ లో తన స్పీచ్ పై తెగ చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించాడు. "ఇటీవల కె-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు." అని బండ్ల ట్వీట్ చేశాడు. మరి ఈ ట్వీట్ తోనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.