English | Telugu

బాలీవుడ్ లో "మిర్చి" రీమేక్..?

ప్రభాస్ ను అభిమానులు ఎలాంటి లుక్కులో చూడాలనుకున్నారో అలాంటి చిత్రంగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రం "మిర్చి". ఈ చిత్రంలో ప్రభాస్ నటన, ఫైట్స్, వేరియేషన్, సెంటిమెంట్, డాన్స్, స్టైల్.. అన్ని కూడా కొత్తగా ఉండటంతో ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

అయితే "మిర్చి" చిత్రం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ దర్శక, నిర్మాతలకు బాగా నచ్చేసింది. దాంతో బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం "మిర్చి" చిత్ర రీమేక్ హక్కులను కొన్నట్లు సమాచారం. తానే హీరోగా నటిస్తూ, తన సొంత బ్యానర్ లో నిర్మించానున్నాడని తెలిసింది. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం ఇంకా తెలియలేదు. ఈ చిత్ర రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.