English | Telugu
Meesala Pilla Song: మీసాల పిల్ల సాంగ్.. బిగ్ స్క్రీన్ పై మెగా మ్యాజిక్!
Updated : Oct 14, 2025
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్, 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదలైంది. (Mana Shankara Varaprasad Garu)
'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' ప్రోమో విడుదలైనప్పటి నుండి ఫుల్ సాంగ్ కోసం అభిమానుల ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫుల్ సాంగ్ వచ్చేసింది. అలిగిన భార్యను కూల్ చేయడానికి భర్త పాడినట్టుగా ఉన్న ఈ మెలోడీ సాంగ్ ని.. భీమ్స్ స్వరపరిచిన తీరు ఆకట్టుకుంది. లిరిక్స్ క్లారిటీగా వినిపించేలా.. సింపుల్ మ్యూజిక్ తో బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. భాస్కరభట్ల లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఉదిత్ నారాయణ్ పాడటం పాటకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. శ్వేతా మోహన్ కూడా తనదైన స్వరంతో ఆకట్టుకుంది. (Meesaala Pilla)
ఇక లిరికల్ వీడియోలో మెగాస్టార్ తన స్క్రీన్ ప్రజెన్స్, గ్రేస్ తో మ్యాజిక్ చేశారు. సింపుల్ స్టెప్స్ ని కూడా తనదైన డ్యాన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. చిరు, నయన్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక "హాల్ లో బాగా చలిగా ఉంది.. దుప్పటి కప్పండ్రా" అంటూ సాంగ్ ని సరదాగా ముగించిన తీరు మెప్పించింది.