English | Telugu
ఆంటీ కాస్త అమ్మమ్మల మారిపోయింది!
Updated : Jul 23, 2013
క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ లో కొన్ని నెలల పాటుగా ఉండి, క్యాన్సర్ ప్రమాదం నుండి విజయవంతంగా బయటపడిన బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా. ఒకప్పుడు బాలీవుడ్ లో తన నటన, అందాలతో టాప్ హీరోయిన్ గా హాల్ చల్ చేసిన మనీషా క్యాన్సర్ బారిన పడి సినిమాలు దూరమయ్యింది.
అయితే ఇటీవలే క్యాన్సర్ చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసుకొని ముంబాయి కి తిరిగి వచ్చింది మనీషా. అయితే ఈ అందాల సుందరి చికిత్స కోసం తన అందమైన కురులను తిసేయాల్సి వచ్చింది. దాంతో ఈ అమ్మడి బట్టతలతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్ నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న మనీషాను చూస్తే.. అందాల సుందరి కాస్త 60ఏళ్ల బామ్మల మారిపోయినట్లుగా అనిపిస్తుంది కదు! మరి ఈ అమ్మడు త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది కావచ్చు. అంతవరకు వేచి చూడాల్సిందే మరి.